బ్రహ్మ సమేధ్యం

తూరుపు తీరంలో తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలంలోని చిట్టచివరి మత్స్యకార గ్రామం పల్లంకుర్రు. దీన్ని దాటి నాలుగు కిలోమీటర్ల దూరం మడ అడవుల మధ్యనుంచి పడవ ప్రయాణం చేస్తే వచ్చే ద్వీపం ‘బ్రహ్మ సమేధ్యం’. ఆ దీవిలో ఒక గుడి. బ్రహ్మేశ్వర స్వామి, ధనలక్ష్మి, దుర్గ అమ్మవారు కొలువుదీరి ఉంటారు.

ఆ గుడిని నమ్ముకున్న పూజారి అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి. ఆయనే ఉదయం, సాయంత్రపు వేళల్లో గుడిలో దీపం వెలిగిస్తాడు. తాను వండుకున్నదే దేవతలకు నైవేద్యం సమర్పిస్తాడు. బ్రహ్మ సమేధ్యంలో ఏడాదికొకసారి చొల్లంగి అమావాస్యనాడు జాతర జరుగుతుంది. అదీ రాత్రిపూట. ఆ సమయంలోనే భక్తులు కిక్కిరిసి కనిపిస్తారు. ఆ మర్నాటినుంచి మళ్ళీ బ్రహ్మేశ్వరుడు, ఆయనకుతోడుగా జగన్మోహన భైరవస్వామి ఒకరికొకరు తోడుగా ఉంటారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *