తూరుపు తీరంలో తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మడలంలోని చిట్టచివరి మత్స్యకార గ్రామం పల్లంకుర్రు. దీన్ని దాటి నాలుగు కిలోమీటర్ల దూరం మడ అడవుల మధ్యనుంచి పడవ ప్రయాణం చేస్తే వచ్చే ద్వీపం ‘బ్రహ్మ సమేధ్యం’. ఆ దీవిలో ఒక గుడి. బ్రహ్మేశ్వర స్వామి, ధనలక్ష్మి, దుర్గ అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఆ గుడిని నమ్ముకున్న పూజారి అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి. ఆయనే ఉదయం, సాయంత్రపు వేళల్లో గుడిలో దీపంContinue Reading

వేంకటేశ్వరుడి లీలలు అనంతం. తిరుమల రాలేని భక్తులకోసం తానే కొండ దిగి వస్తాడు. అలా 500ఏళ్ళ క్రితం పాలమూరు (మహబూబ్ నగర్) సమీపంలో మన్యంకొండపై కొలువైనాడు. శ్రీరామయోగి ప్రతిష్టించిన విగ్రహం, అళహరి కేశవయ్య ప్రతిష్టించిన విగ్రహం… ఆదిశేషుడి పడగలాంటి గుహలో పూజలందుకుంటున్నాయి. “తీరితే తిరుపతి… తీరకపోతే మన్యంకొండ” అన్న నానుడి ఈ గుడికి వచ్చిందంటే దీని ప్రాశస్త్యం ఎటువంటిదో ఊహించుకోవచ్చు.   

తెలుగు వారి పుణ్య ఫలమేమో… నరసింహుడు అడుగడుగునా కొలువుదీరి ఆశీర్వదిస్తున్నాడు. కొండపై నిండుగా కొలువున్న నరసింహ క్షేత్రాలలో అరుదైనది తెలుగు వారి పుణ్య ఫలమేమో… నరసింహుడు అడుగడుగునా కొలువుదీరి ఆశీర్వదిస్తున్నాడు. కొండపై నిండుగా కొలువున్న నరసింహ క్షేత్రాలలో అరుదైనది కోరుకొండ. ఇది నిటారుగా నింగినంటుతున్నట్టుగా నిలబడి భక్తులకు పరీక్ష పెడుతుంది. ఈ కొండను ఎక్కడం చక్కటి అనుభవం. ఫాల్గుణ మాస శుక్ల ఏకాదశినాడు జరిగే తీర్థంలో పాల్గొనడం మరో అనుభూతి. ఈContinue Reading

హైదరాబాద్ చేరువలో కుతుబ్ షాహీల మత సామరస్యాన్ని, మొగలాయీల నిర్దాక్షిణ్యాన్ని చవిచూసిన క్షేత్రం మాంకాల్ మహేశ్వరం. ఛత్రపతి శివాజీ విడిది చేసిన చోటు…. అక్కన్న, మాదన్నలు తిరుగాడిన ఊరు. శతాబ్దాలపాటు ఎడబాటు ననుభవించిన మహంకాళి-మహేశ్వరులు… ఒక మాస్టారి చొరవతో ఒక్కటయ్యారు. 

రాష్ట్రంలో అయ్యప్ప దీక్షధారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దసరా పండుగ దాటగానే నల్లబట్టలు ధరించి, చందన కుంకుమ బొట్టు పెట్టుకుని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే భక్తకోటి దర్శనమిస్తోంది. స్వామియే శరణం అయ్యప్ప అని ఘోషిస్తూ ఏటా లక్షల సంఖ్యలో శబరిమలై సందర్శిస్తున్నారు. కార్తీక మాసం ప్రవేశించగానే తెలుగునాట ప్రతి పట్టణం, పల్లెల్లో అయ్యప్ప మాలధారులు కనిపిస్తారు. వీరంతా పుష్య మాసం (డిసెంబర్‌, జనవరి)లో శబరి మలై వెళ్లి స్వామిని దర్శిస్తారు.Continue Reading