తెలుగు నేల అడుగడుగునా దేవుని జాడలున్నాయి. శ్రీమహావిష్ణువు అవతార మూర్తులు ఇక్కడ కొలువుదీరాయి. అరుదైన మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన దేవాలయాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలుగునాట పూజలందుకుంటున్నాయి.  శ్రీమహావిష్ణువు తొలి అవతారమైన మత్స్య దేవుడి ఆలయాన్ని పరిచయం చేస్తున్నాం. తెలుగు నేలను పాలించిన రాజులలో కాకతీయులది అద్వితీయ స్ధానం. ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లోనే కాకుండా ఆథ్మాత్మికపరంగానూ వారు ఎనలేని సేవలు చేశారు. వారి కాలంలోనే వేయిస్తంభాలContinue Reading

ఒక సాధకుడి జీవితంలో నవరాత్రులను మూడు భాగాలుగా విభజించి ఆ దేవికి వుండే మూడు అంశలుగా భావించి ఆరాధించడంవల్ల ఎంతో పవిత్రమైన సత్యం ఆవిష్కరణ అవుతుంది. దేవికి తొమ్మిది రోజులు చేసే నవరాత్ర పూజ ఆత్మ సాక్షాత్కారానికి అనువైన మార్గంగా బోధిస్తున్నారు స్వామి శివానంద.  – దుర్గ పూజలోని ఆంతర్యం– ధర్మ ప్రచారం వ్యర్థం కాదు – అంచెలంచెల వేదాంతజ్ఞానంతోనే సాధన సిద్ధి 

శతక సాహిత్యం అతి ప్రాచీనమైంది. మానవ జీవనం సన్మార్గంలో సాగిపోయేలా మార్గదర్శనం చేస్తుంది. సమాజ తీరుతెన్నులను అవగతమయ్యేలా విడమరచి బోధిస్తుంది. మంచి చెడ్డలను విశ్లేషించి చూపుతుంది. వేమన, బద్దెన రాసిన శతకాలు ఏళ్లు గడుస్తున్నకొద్దీ వన్నె తరగని నిధులు. వాటిలో 13వ శతాబ్దికి చెందిన బద్దెన రచించిన ‘సుమతి శతకం’ నిత్య జీవితానికి సరిపోయే సూక్తులను ఎన్నింటినో తనలో పొదుగుకుంది. సుమతి శతక సూక్తులకు సొంత వ్యాఖ్యానంతోపాటు వివేకానందుని అమృతవాక్యులుకూడాContinue Reading

వెలుగుకు మారుపేరైన దేశం చిమ్మచీకట్లో ఉన్నప్పుడు చిరుదివ్వెలా…బానిస భారతం సంకెళ్లు తెగదెంచే సమ్మెటలా…మూఢాచారమే మతంగా, వివక్షే కులంగా వికటించిన కాలంలో వేదాంత విప్లవమూర్తిలా…తెల్లతోలువాడు ఏమి చెప్పినా అదే విజ్ఞానంగా భావించే బానిస యుగంలో స్వాభిమానపు, ఆత్మవిశ్వాసపు అద్భుత రూపంగా…స్తబ్దుగా పడున్న సమాజానికి వేకువ వార్త చెప్పే వైతాళికుడిలా…భారతీయుల బద్దకాన్ని భగ్నంచేసే భగవద్దూతగా…పరాక్రమ భారతపు ప్రభాత గీతంగా…దైర్బల్యానికి వైరిగా, వేదాంతపు భేరీగా వచ్చాడు వివేకానందుడు.ఆయన కళ్లు వర్గమానాన్ని ఛేదించి భవిష్యత్తును చూశాయి.Continue Reading

మానవ జీవితం భూమండలంపై ఉండే వివిధ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితులు అనుకూలిస్తే జీవితం సుఖమయంగానూ, ప్రతికూలిస్తే దుఃఖమయంగానూ భావిస్తాం. ఈ పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. అందుకే జాతక చక్రాలు భూమిపై ఆయా గ్రహాల ప్రసరణ వంటి వివరాల ఆధారంగా భవిష్యత్‌ను అంచనా వేస్తారు. ఆయా గ్రహాల శుభదృష్టి ఉంటే శుభసూచకం అని, ప్రతికూల దృష్టిContinue Reading